భారతదేశం, మే 5 -- తెలంగాణలో పోలీసులు నూటికి నూరుశాతం శాంతిభద్రతలు కాపాడుతున్నారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి.. ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందన్నారు. దేశ సరిహద్దుల్లోని సైనికుల్లా.. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారని అభినందించారు. పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదని అభివర్ణించారు.

'విధి నిర్వహణలో పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టే.. మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ప్రజా ప్రభుత్వంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా అందిస్తున్నాం. విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు, అడిషనల్ ఎస్పీ, ఎస్పీల కుటుంబాలకు రూ.కోటిన్నర అందిస్తున్నాం. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వంలో చర్యలు...