భారతదేశం, జనవరి 24 -- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన 'ది రాజా సాబ్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది.

అయితే, సినిమా ఫలితం ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో ది రాజా సాబ్‌పై జరుగుతున్న నెగెటివ్ క్యాంపెయిన్, ట్రోలింగ్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఎస్‌కేఎన్ (SKN), శుక్రవారం (జనవరి 23) నాడు హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తన పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ సృష్టించి, ది రాజా సాబ్ సినిమాను, అందులోని నటీనటులను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రొడ్యూసర్ ఎస్...