భారతదేశం, డిసెంబర్ 14 -- బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం కొత్తగా పోలవరం - నలమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వేగంగా కసరత్తు చేసే పనిలో ఉంటోంది. అయితే అంతే వేగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అడ్డుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ సర్కార్ ముందుగా ప్రతిపాదించిన బనకచర్ల పేరు మార్చి.ఈ కొత్త లింకింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చూస్తోందని ఆరోపిస్తోంది.ప్రస్తుతానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్​ఆర్​) ఇంకా పరిశీలన దశలోనే ఉందని.. ఏపీ సర్కార్ చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు అనుతులు ఇవ్వకుండా చూడాలని కోరుతోంది.

తాజాగా ఇదే అంశంపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాశారు. పోలవరం - నల్లమల్ల సాగర్ లింకింగ్ ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఈ ప...