భారతదేశం, డిసెంబర్ 19 -- రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచే పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం కాగా. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు.

విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) - RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ పను...