భారతదేశం, జూలై 29 -- పోలవరం-బనకచెర్ల అనుసంధాన పనులు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా, జల్ శక్తి మంత్రిత్వ శాఖ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (PFR) మాత్రమే సమర్పించిందని తెలిపింది.

ఈ ప్రాజెక్టు గురించి రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సాంకేతిక, ఆర్థిక పరిశీలన కోసం ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను మాత్రం ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి అందించినట్టుగా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను స్వీకరించినట్టుగా చెప్...