భారతదేశం, జూన్ 30 -- పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు మీద అభ్యంతరాలు ఉన్నాయని, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాలని వెల్లడించింది. పర్యావరణ అనుమతులకు సంప్రదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును చేపట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదికను నిపుణుల కమిటీ పరిశీలన చేసింది. 1983లో గోదావరి ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని వెల్లడించింది. నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులను పరిశీలించాలని పేర్కొంది. పర్యావరణ ప్రభావం మీద అంచనా వేసిన తర్వాత అనుమతి ఇచ్చేందుకు సాధ్యమవుతుందని కమిటీ పేర్కొంది.

బనకచర్ల ప...