భారతదేశం, డిసెంబర్ 31 -- పోలవరం పనుల పురోగతిని వైసీపీ పార్టీ కళ్లు ఉండి చూడలేనిదిగా తయారైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై మండిపడ్డారు. పోలవరం పనుల పురోగతిపై విమర్శలు చేయడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఐదేళ్ళు అధికారం ఇస్తే 2 శాతం పనులు మాత్రమే చేయగలిగారని, అలాంటప్పుడు, ఆపార్టీ పోలవరం పనుల గురించి మాట్లాడటం, విమర్శలు చేయడం విడ్డూరం కాకపోతే మరి ఏమిటని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. 2014 -19 హాయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం పనులు72 శాతం పూర్తయ్యాయని మంత్రి రామానాయుడు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 13 శాతం పూర్తి చేయగలిగామన్నారు....