భారతదేశం, జనవరి 12 -- పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో తాము పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు.

రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని స్పష్టం చేసింది.

పోలవరం-నల్లమలసాగర్ ల...