భారతదేశం, డిసెంబర్ 16 -- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర జల వివాదంపై మరోసారి చర్చ నడుస్తోంది. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్(PNLP)(గతంలో పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్‌)ను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోదావరి నది నుండి మిగులు వరద జలాలను కృష్ణ, గుండ్లకమ్మ బేసిన్లకు మళ్లించే లక్ష్యంతో ఉన్న ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కొనసాగించకుండా నిరోధించాలని కోరుతోంది.

1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తోందని పిటిషన్‌లో తెలంగాణ ఆరోపించింది. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కొనసాగుతున్న విస్తరణ పనులు, నవంబర్ 21న విడుదలై నవంబర్ 24న సవరించిన వివరణాత్మక ప్రాజ...