భారతదేశం, డిసెంబర్ 12 -- బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం కొత్తగా పోలవరం - నలమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వేగంగా కసరత్తు చేసే పనిలో ఉంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలోనూ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదమే చేలరేగింది. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఆశించిన స్థాయిలో అనుమతులు రాకపోవటంతో. ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. డీపీఆర్ లను కూడా రద్దు చేసింది. ఆ వెంటనే పోలవరం -నలమల సాగర్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చింది.

ఈ కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ సర్కార్ ను అడ్డుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సిద...