భారతదేశం, జనవరి 24 -- అంతర్జాతీయ మార్కెట్​లతో పోల్చితే దేశీయ స్టాక్​ మార్కెట్​ గతేడాది సరిగ్గా రాణించలేదు. నిఫ్టీ, సెన్సెక్స్​లు స్వల్ప వృద్ధిని నమోదు చేయగా, స్మాల్​క్యాప్​- మిడ్​క్యాప్​లు నెగిటివ్​ రిటర్నులు ఇచ్చాయి. వీటి మధ్య కొత్త ఆశలతో 2026లోకి ప్రవేశించిన మదుపర్లకు ఆరంభ లాభాలు ఊరటనిచ్చాయి. కానీ మొదటిలో మదుపర్లలో కనిపించిన ఆశావాదం కొద్ది వారాల్లోనే ఆవిరైపోయింది.

ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ సుమారు 3 శాతం మేర నష్టపోగా.. బ్లూచిప్ షేర్ల కంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ దాదాపు 8 శాతం, మిడ్ క్యాప్ 5 శాతం మేర పడిపోయాయి. రోజూ ఏదో ఒక వార్తతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పోర్ట్​ఫోలియోలను చూడాలంటేనే భయపడుతున్నారు. అసలు ఈ నష్టాలకు కారణాలంటే? స్టాక్​ మార్కెట్​ పతనం ఎప్పుడు ఆగ...