Hyderabad, ఏప్రిల్ 22 -- పోప్ ఫ్రాన్సిస్ మరణానికి కారణమైన వ్యాధి బైలేటరల్ నిమోనియా. వాటికన్ సిటీ సోమవారం ఒక వీడియో ప్రకటనలో పోప్ ఫ్రాన్సిస్ మరణించిన సంగతిని ప్రకటించింది. అతను బైలేటరల్ నిమోనియా అని పిలిచే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారని ఆ కారణంగానే ఆసుపత్రిలో చేరారని తెలిపింది. ఈ వ్యాధి కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయి మరణం సంభవిస్తుంది.

నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ వ్యాధి. దీనివల్ల చీము, ద్రవంతో ఊపిరితిత్తులు నిండిపోతాయి. శ్వాస తీసుకోవడంలో ఆ రోగికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయితే ఎక్కువగా ఒక ఊపిరితిత్తిలోనే ఈ నిమోనియా అధికంగా వస్తూ ఉంటుంది. కానీ కొందరిలో రెండు ఊపిరితిత్తుల్లో కూడా నిమోనియా సోకుతుంది. దీన్నే బైలేటర్ నిమోనియా అంటారు. ఈ స్థితిలో రెండు ఊపిరితిత్తులు చెడిపోతాయి. తగినంత ఆక్సిజన్ శరీరానికి అందదు. రక...