భారతదేశం, ఏప్రిల్ 22 -- పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరిగే తేదీ, సమయం లను వాటికన్ మంగళవారం వెల్లడించింది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం ఉదయం 10:00 గంటలకు సెయింట్ పీటర్స్ బాసిలికా ఎదురుగా ఉన్న స్క్వేర్ లో జరుగుతాయని వాటికన్ ప్రకటించింది. అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయస్సులో సోమవారం మరణించారు. శనివారం, ఉదయం 10 గంటలకు పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను చర్చిలోకి తీసుకెళ్లి, అక్కడి నుంచి శాంటా మారియా మాగియోర్ లోని రోమ్ బసిలికాకు తరలించి ఖననం చేయనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....