భారతదేశం, మే 5 -- నిడదవోలులో దారుణ హత్య జరిగింది. నాలుగేళ్ల క్రితం ఇంటర్‌ బాలికను వేధించిన కేసులో అరెస్టైన నిందితుడు పోక్సో కేసులో శిక్ష నుంచి తప్పించుకోడానికి బాధితులతో రాజీ కుదుర్చుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో యువతి తండ్రిపై పగ పెంచుకుని మాటు వేసి హత్యకు పాల్పడ్డాడు.

మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో వేధించిన లారీ డ్రైవర్‌ చివరకు ఆమె తండ్రిని హత్య చేసిన ఘటన నిడదవోలులో ఆదివారం జరిగింది. పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మాటు వేసి బాలిక తండ్రిని హత్య చేశాడు.

తూర్పుగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. నిడదవోలు సీఐ తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలు చింతచెట్టు వీధికి చెందిన షేక్‌ వల్లీభాషా వంట పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు 2021లో స్థానిక కాలేజీలో ఇంటర్ ...