భారతదేశం, మే 14 -- ఏప్రిల్ 23న తమకు పట్టుబడిన సరిహద్దు భద్రతా దళం జవాను పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ రేంజర్లు బుధవారం పంజాబ్ లోని అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత్ కు అప్పగించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పాక్ రేంజర్లు కానిస్టేబుల్ ను బీఎస్ఎఫ్ కు అప్పగించారు. శాంతియుతంగా, నిబంధనలకు అనుగుణంగా అప్పగింత జరిగిందని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే, ఏప్రిల్ 23న ఫిరోజ్ పూర్ జిల్లాలోని అక్కడి రైతుల పంట పనులను పర్యవేక్షించే విధుల్లో ఉన్న పూర్ణమ్ కుమార్ షా అనుకోకుండా భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు ను దాటాడు. దాంతో అతడిని పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ''పశ్చిమబెంగాల్ కు చెందిన బీఎస్ఎఫ్ 24వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ షా ప్రమాదవశాత్తు ఫిరోజ్ పూర్ సెక్టార్ లోని జీరో లైన్ దాటడంతో పాక్ రేంజర్...