భారతదేశం, నవంబర్ 19 -- శీతాకాలంలో దట్టమైన పొగమంచు పరిస్థితుల దృష్ట్యా ప్రమాదాలను నివారించడానికి అన్ని వాహనదారులు అవసరమైన భద్రతా సూచనలను పాటించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR), హైవేలు, పొగమంచుతో తక్కువగా కనిపించే ప్రధాన నగర రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు గరిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి. పొగమంచుతో సరిగా కనిపించదని, వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

పొగమంచు ఉన్న సమయంలో ఎల్లప్పుడూ తక్కువ-బీమ్ హెడ్‌లైట్‌లను ఉపయోగించాలని, హై-బీమ్ లైట్లను ఉపయోగించకుండా ఉండాలని పోలీసులు సలహా ఇచ్చారు. పొగమంచు ప్రభావిత ప్రాంతాలలోకి ప్రవేశించిన వెంటనే ఫాగ్ లైట్లను ఆన్ చేయండి. తక్కువ వేగంతో వెళ్లాలి. ఎల్లప్పుడూ మీకు వాహనంపై కంట్రోల్ ఉండాలి.

సడెన్‌గా ఢీకొనకుండా, సడెన్ బ్రేకింగ్‌ను నివారించడానికి ము...