భారతదేశం, నవంబర్ 24 -- ఐబొమ్మ, బప్పం పోర్టల్‌లలో పైరేటెడ్ సినిమాలను పబ్లిష్ చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమంది రవి, నేరాల ద్వారా సంపాదించిన డబ్బును తన స్నేహితులకు బదిలీ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు ఎక్కువగా సంపాదించాడు. రవి ఐదు రోజుల పాటు హైదరాబాద్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణ సమయంలో రవి తన సంపాదనను అనేక దేశాల పర్యటనలకు ఖర్చు చేశానని, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌లో కొన్ని ఆస్తులను కొనుగోలు చేశానని చెప్పాడు. విదేశాలలో ఉన్న అతని ఖాతాలలో పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

సోమవారం ప్రశ్నల తర్వాత పోలీసులు రవిని కోర్టు ముందు హాజరుపరుస్తారు. సాంకేతిక ఆధారాలు పొందిన పోలీసు అధికారులు రవి డేటాను నిల్వ చేయడానికి, తన పోర్టల్‌లను నిర్వహించడానికి...