భారతదేశం, నవంబర్ 22 -- పైరేట్ వెబ్ సైట్ ఐబొమ్మ నడుపుతున్న ఇమ్మడి రవిని ఈ వారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తర్వాత కొందరు ప్రేక్షకులు రవి చట్టవిరుద్ధమైన ఆన్ లైన్ మూవీ స్ట్రీమింగ్ కు మద్దతు తెలుపుతూ, అతన్ని రాబిన్ హుడ్ తో పోల్చారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలాంటి వారిపై విరుచుకుపడ్డారు. వారి అజ్ఞానాన్ని ఎత్తిచూపారు.

ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్, ఇమ్మడి రవి, పైరసీపై రామ్ గోపాల్ వర్మ తన స్టైల్లో రియాక్టయ్యారు. ''పైరసీ ఎప్పటికీ ఆగదు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం వల్లనో లేదా పోలీసుల పర్యవేక్షణ బలహీనంగా ఉండటం వల్లనో కాదు. పైరసీ చేసిన సినిమాను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నంత కాలం, వారికి సేవ చేయడానికి 'రవి'లు ఎప్పుడూ ఉంటారు'' అని ఆర్జీవీ ఎక్స్ లో పెద్ద పోస్టు పంచుకున్నారు.

''హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, రవి మద్దతుదారులు అతన్ని గర్వంగా రాబిన...