Hyderabad, జూలై 3 -- "సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

-పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్స్‌లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు.

-ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్. కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నా...