భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్​లో 33 ఏళ్ల మహిళా సైకాలజిస్ట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన పేషెంట్​ని పెళ్లి చేసుకున్న ఆ మహిళ, భర్త- అతనిక కుటుంబ సభ్యుల వేధింపులను తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంజారాహిల్స్‌లోని ఒక మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోహిత్‌తో, అప్పట్​లో ఇంటర్న్‌గా ఉన్న డాక్టర్ ఏ. రజితకు పరిచయమైంది. రజిత చికిత్సతో రోహిత్ ఆరోగ్యం మెరుగుపడటంతో, అతని కుటుంబం ఆమెను ఎంతగానో అభినందించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రోహిత్, రజితకు ప్రపోజ్ చేయడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

రజిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెళ్లి తర్వాత రోహిత్ ఉద్యోగం మానేశాడు. రజిత సంపాదనపై ఆధారపడ్డాడు. ఒక అంతర్జాతీయ పాఠశాలలో చైల్డ్ సైకాలజిస్ట్‌గా పని...