Hyderabad, ఏప్రిల్ 27 -- యంగ్ ట్యాలెంటెడ్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్స్‌గా నటించిన లేటెస్ట్ మూవీ పేషన్. తెలుగు ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన 'పేషన్' సినిమాకు అరవింద్ జాషువా దర్శకత్వం వహించారు. రెడంట్ క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మించారు.

పేషన్ మూవీ ఫస్ట్ లుక్‌ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పేషన్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఫస్ట్ లుక్ లాంచ్ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. "అరవింద్ జాషువా ఆనంద్ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పటిలోనే తనలో స్టోరీ టెల్లింగ్ రైటింగ్ క్రియేటర్ ఉన్నాడని అనిపించింది. తను పేషన్ అని ఒక నవల రాశారు. అది నేను చదివాను. చాలా బాగుంది" అని అన్నార...