Hyderabad, అక్టోబర్ 10 -- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న 'స్పిరిట్', నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సీక్వెల్ సినిమాల నుండి వైదొలగిన తర్వాత దీపికా పదుకోన్ తొలిసారి తన 8 గంటల షిఫ్ట్ డిమాండ్ పై స్పందించింది. CNBC-TV18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. "మగ సూపర్ స్టార్స్" చాలా సంవత్సరాలుగా 8 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్నారని.. కానీ అది "ఎప్పుడూ వార్తల్లో రాలేదు" అని అనడం గమనార్హం.

దీపికా పదుకోన్ షిఫ్ట్ డిమాండ్లతో కొన్నాళ్లుగా వివాదాల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తన నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పినప్పుడు దీపిక ఇలా స్పందించింది. "నేను ఒక మహిళను కాబట్టి నా డిమాండ్ అగౌరవంగా లేదా అభ్యంతరకరంగా అనిపిస్తే అలాగే అనిపించనీయండి. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మగ సూపర్ స్టార్స్ సంవత్సరాలుగా ఎనిమిది గంటలు మాత్రమే పనిచే...