భారతదేశం, జూలై 16 -- బాలీవుడ్ లో మరో స్టార్ కపుల్ పేరేంట్స్ గా మారారు. రణబీర్ కపూర్-అలియా భట్ జోడీలా సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పేరేంట్స్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. ఈ జంట తమ తొలి బిడ్డకు వెల్ కమ్ చెప్పారు. ముంబయిలో కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.

బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. అయితే ఈ జంట నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రిలయన్స్ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ ద్వారా కియారా బిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వార్తతో బాలీవుడ్ లో సంతోషం నిండింది. ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

తాము పేరేంట్స్ కాబోతున్నామని ఈ ఏడాది ...