భారతదేశం, ఏప్రిల్ 22 -- మల్కన్‌గిరి జిల్లాలో దీర్ఘకాలంగా ఆసుపత్రి ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి అనుకోకుండా చనిపోయారు. ఆయనకు చాలా సంపాద ఉంది. కానీ ఆయన బతికిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దంబారు గరడ అనే ఈ వ్యక్తి పేదరికం అంచున నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. కానీ ఆయన నివాసంలో భారీ నగదు దొరికింది.

33 సంవత్సరాలుగా దంబారు ప్రభుత్వం అందించిన ఇంట్లోనే నివసించాడు. పదవీ విరమణకు ఒక నెల ముందు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. నెలకు దాదాపు రూ. 50,000 జీతం తీసుకునేవాడు. విద్యుత్, వంట సౌకర్యాలు వంటి ముఖ్యమైన అవసరాలను కూడా పట్టించుకోలేదు. ఆయన జీవనశైలి చాలా కఠినంగా ఉండేది. విద్యుత్ సేవలు ఉన్నప్పటికీ.. లైటింగ్ కోసం కొవ్వొత్తులను ఉపయోగించేవారని పొరుగువారు గుర్తుచేసుకున్నారు.

ఇంటి వాతావరణం దారుణంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. దంబా...