భారతదేశం, నవంబర్ 2 -- తెలంగాణ భవన్‌లో పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచ‌కాల‌కు ఎంతో మంది బాధితులుగా మారారు అని విమర్శించారు. మూసీ వల్ల, హైడ్రా వ‌ల్ల ఎంతో మంది బాధితులుగా అయ్యారని తెలిపారు.

'చాంద్రాయ‌ణ‌ గుట్టలో స్కూల్ కూడా కూల‌గొట్టారు. కేసీఆర్ హయాంలో ఎక్కడ చూసినా క‌ట్టడాలే క‌నిపిస్తాయి. హైద‌రాబాద్‌లోనే ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టించాం. వైట్ హౌస్‌ను త‌ల‌ద‌న్నేలా స‌చివాల‌యం క‌ట్టాం. దేశంలోనే అతిపెద్ద పోలీస్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ క‌ట్టుకున్నాం. హైద‌రాబాద్‌లో 42 ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు క‌...