భారతదేశం, నవంబర్ 12 -- ఏపీలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఒకేసారి 3 లక్షల మంది పేదలు. గృహ ప్రవేశాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-బీఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు.

మొత్తంగా 3,00,192 ఇళ్లకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసా...