భారతదేశం, నవంబర్ 10 -- సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 70 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ, కంపెనీలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ నిర్ణయాలు, పరిశ్రమలో ఏర్పాటులో రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ, పేదలకు ఇళ్లతోపాటు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. పేదలకు హౌసింగ్ కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. నివాస స్థలం లేని అర్హుల జాబితాను రూపొందించి.. హౌస్ సైట్స్ వచ్చేలా చూడాలన్నారు. ఏడాదిలోగా నివాస స్థలం లేని వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయ...