Hyderabad, సెప్టెంబర్ 2 -- ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. భాద్రపద శుక్ల ఏకాదశి పరివర్తిని ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తి ఈ పరివర్తిని ఏకాదశి నాడు యోగ నిద్రలో తన భుజాన్ని మార్చుకుంటాడు. అందుకనే దీనిని పరివర్తిని ఏకాదశి అని అంటారు.

ఈసారి పరివర్తిని ఏకాదశి సెప్టెంబర్ 3న వచ్చింది. దీనిని పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షాన్ని పొందవచ్చని నమ్మకం. అదే విధంగా ఏకాదశి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన వివాహం, కెరీర్, డబ్బు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మరి పరివర్తన ఏకాదశి నాడు సమస్యలు తొలిగి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలు...