భారతదేశం, ఫిబ్రవరి 23 -- టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ వెడ్డింగ్ 'విరోష్' (Vijay-Rashmika) వేడుకలకు సమయం ఆసన్నమైంది. తమ కలల వివాహం కోసం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నేడు (ఫిబ్రవరి 23) రాజస్థాన్‌లోని 'సిటీ ఆఫ్ లేక్స్' ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన ఈ జంట తమ స్టైలిష్ అప్పియరెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉదయ్‌పూర్‌లోని ప్రముఖ 'మెమెంటోస్ బై ITC హోటల్స్, ఏకాయ' (Mementos by ITC Hotels, Ekaaya) వేదికగా వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి.

పెళ్లి సందడిలో ఉన్న ఈ జంట ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ దుస్తులకు బదులుగా, అత్యంత విలాసవంతమైన 'బిజినెస్ క్యాజువల్' (Business Casuals) లుక్స్‌లో మెరిసిపోయారు. వీరి ఫ్యాషన్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

రష్మిక 'డీప్ గ్రేయిష్ బ్లూ' రంగు అవుట్‌ఫిట్‌లో మెరిసింది. ఆమె లు...