భారతదేశం, మే 17 -- ఆ జంట రెట్రో స్టైల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది. అందరికీ నచ్చే వీడియోతో వివాహానికి ఆహ్వానాలను పంపారు. పెళ్లి మండపంలో కుటుంబం అంతా ఆనందంగా ఉంది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆ జంట సంబరాల్లో మునిగిపోయింది. కానీ విధి వారిని చూసి అసూయపడింది. వివాహం జరిగిన 15 నిమిషాల్లోనే వరుడు గుండెపోటుతో మరణించాడు. మృతుడు వరుడు ప్రవీణ్ కుర్నే(25) మరణంతో కొన్ని క్షణాల్లో నవ వధువు వితంతువుగా మారింది. వివాహ వేడుక కాస్త దుఃఖంతో నిండిపోయింది.

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా జామఖండి నగరంలోని నందికేశ్వర్ కళ్యాణమంటపంలో ప్రవీణ్ కుర్నే వివాహం శనివారం జరిగింది. అయితే వివాహ వేడుక జరిగిన కొన్ని క్షణాల్లోనే విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రవీణ్ పెళ్లి చేసుకున్న 15 నిమిషాల్లోనే గుండెపోటుతో మరణించాడు.

పెళ్లి చేసుకున్న తర్వాత నూతన వధూవరులు వేదికపై నిల...