భారతదేశం, నవంబర్ 7 -- టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే జోరుగా మొదలయ్యాయని తాజాగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రష్మిక మందన్న ఒక 'గ్రాండ్ సెలబ్రేషన్' కోసం అనువైన వేదికలను వెతకడానికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్ ఈ మధ్యే జరిగిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం పెళ్లి వేదికల అన్వేషణలో భాగంగా రష్మిక ఇటీవల ఉదయ్‌పూర్‌కు ఒక చిన్న ట్రిప్ వేసింది. తన జీవితంలో అతిపెద్ద ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు కచ్చితంగా ఉండేలా చూసుకోవడానికి ఈ నటి స్వయంగా ఆ పనులు చూసుకుంటోంది.

"రష్మిక ఉదయ్‌పూర్‌లో అనువైన వేదికల కోసం వెతకడానికి వెళ్లడం నిజం. ఆమె మూడు రోజులు అక్కడే ఉం...