భారతదేశం, డిసెంబర్ 13 -- తెలుగు స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత తొలిసారి బయట జంటగా కనిపించారు. వీళ్లు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన ఒక సన్నిహిత వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత నూతన వధూవరులు ఇటీవల ముంబైకి చేరుకున్నప్పుడు మొదటిసారి కలిసి కనిపించారు.

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి తర్వాత మొదటసారి జంటగా కనిపించిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. వీళ్లు ముంబై విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్నప్పుడు కలిసి కనిపించారు. ఇద్దరూ సాధారణ దుస్తుల్లో ఉన్నారు. సమంత ఒక గ్రే స్వెటర్, నల్ల ప్యాంట్లలో స్టైలిష్‌గా కనిపించగా, రాజ్ నిడిమోరు సముద్రపు ఆకుపచ్చ టీ-షర్ట్, బ్లూ జీన్స్, బ్లాక్ డెనిమ్ జాకెట్‌లో కనిపించాడు. ఫోటోగ్రాఫర్లు వారిని క్లిక్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపారు తమ కారు వైపు వెళు...