భారతదేశం, జనవరి 16 -- ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వీళ్ల పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. వాలెంటైన్స్ డే సందర్బంగా ఫిబ్రవరి 14, 2026న వీళ్లు పెళ్లి చేసుకోబుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఇదే టాపిక్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి టాపిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ జంట ఫిబ్రవరి 14, 2026న పెళ్లి చేసుకోబుతున్నారనే పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పెళ్లికి ధనుష్, మృణాల్ ఠాకూర్ కు చాలా దగ్గరివాళ్లు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. చాలా కొద్ది మంది సమక్షంలోనే వీళ్లు వివాహమాడతారని అంటున్నారు.

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారని గత కొంతకాలం నుంచి రూమర్లు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఏ ఒ...