భారతదేశం, డిసెంబర్ 9 -- ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చేసింది. ఉత్కంఠ రేపే స్టోరీ లైన్ తో ీ మూవీ తెరకెక్కింది. అదే 'డై మై లవ్'. ఈ థ్రిల్లర్ మూవీలో రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లు కూడా ఎక్కువే. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి రిజల్ట్ సాధించింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ డై మై లవ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం (డిసెంబర్ 9) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ ఇప్పుడు రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సినిమా చూడాలంటే రెంట్ గా డబ్బులు పే చేయాల్సిందే. ఈ రోజు నుంచే డిజిటల్ ఆడియన్స్ కోసం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

డై మై లవ్ సినిమాలో జెన్నిఫర్ లారెన్స్, రాబర్ట్ పాటిన్సన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాలో జెన్నిఫర్ లారెన్స్ నటన క్ర...