Hyderabad, ఆగస్టు 9 -- గౌరి ఫిలింస్‌తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తోన్న సినిమా "పెళ్లిలో పెళ్లి". ఈ సినిమాలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న "పెళ్లిలో పెళ్లి" సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న పెళ్లిలో పెళ్లి మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌తో పాటు బ్యానర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా...