భారతదేశం, డిసెంబర్ 7 -- సమంత, రాజు నిడిమోరు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీళ్ల వివాహం జరిగింది. సమంత, రాజ్ వెడ్డింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వీళ్ల పెళ్లి డిసెంబర్ 1న జరిగింది. కానీ ఇప్పటికీ ఈ జంట గురించి నెటిజన్లు ఆరా తీస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా రాజ్ పిన్ని సమంత గురించి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

శోభా రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పర్సనాలిటీ ఈమె. సంగీత విద్వాంసురాలు. అన్నమాచార్య సంకీర్తనలు, సంగీత ప్రయోగాలతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. రాజ్ నిడిమోరుకు శోభా రాజు స్వయానా చిన్నమ్మ. రాజ్ వాళ్ల అమ్మ చెల్లెనే శోభా రాజు. ఈవిడ ఇటీవల సమంత గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

రాజ్ నిడిమోరుతో పెళ్ల...