భారతదేశం, డిసెంబర్ 20 -- వైవిధ్య‌మై ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాటజీతో 'దండోరా' సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్‌ను పూర్తి చేసుకోవ‌టం విశేషం. డిసెంబర్ 25న దండోరా మూవీ రిలీజ్ కానుంది. సినిమాలో బిగ్ బాస్ శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు నటించారు.

మంచి అంచ‌నాల‌తో క్రిస్మ‌స్ సంద‌ర్బంగా విడుద‌ల‌వుతోన్న 'దండోరా' ట్రైలర్‌ను శుక్ర‌వారం (డిసెంబర్ 19) విడుద‌ల చేశారు మేకర్స్. కులం వంటి ఓ సెన్సిటివ్ విష‌యాన్ని క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఫ‌న్నీగా ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ ముర‌ళీకాంత్‌. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.

తాజాగా విడుద‌లైన 'దండోరా' ట్రైల‌ర్‌తో సినిమాపై అంచనాలు మ‌రింత పెరిగాయి. దండోరా ట్రైల‌ర్‌ను గ‌మ‌...