భారతదేశం, నవంబర్ 14 -- రొమాంటిక్ కామెడీ సినిమాలతో జోరు కొనసాగిస్తున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. మధ్యలో జాక్ తో బ్రేక్ పడ్డా కూడా మరోసారి తెలుసు కదా అంటూ రొమాంటిక్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ (నవంబర్ 14) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ రొమాంటిక్ మూవీ తెలుసు కదా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో తెలుసు కదా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయిదు భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది.

తెలుసు కదా మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 17, ...