Hyderabad, మార్చి 14 -- వివాహం కాకముందు సన్నగా ఉండే పురుషులు వివాహమైన కొన్ని నెలల తర్వాత బరువు పెరగడం ప్రారంభమవుతుంది. కొన్నేళ్ల తర్వాత వారి బొజ్జ మాత్రమే పెరుగుతుంది. అలా వారు ఊబకాయం బారిన పడతారు. బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బంది పడతారు. ఇలా ఎందుకు జరుగుతుందో అధ్యయనం వివరించి చెప్పింది. చాలా మంది పెళ్లయిన తర్వాత భార్య దగ్గరుండి ఆహారాన్ని ప్రేమగా తినిపించడం వల్లే వారు బరువు పెరుగుతారని అనుకుంటారు. అయితే అధ్యయనం ఏం చెప్పిందో తెలుసుకుందాం.

పోలాండ్‌లోని చేసిన ఒక అధ్యయనంలో పెళ్లి కాని పురుషులతో పోలిస్తే పెళ్లి అయిన పురుషులలో ఊబకాయం వచ్చే ప్రమాదం 62 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అదే మహిళల విషయానికి వస్తే పెళ్లి కాని మహిళలతో పోలిస్తే పెళ్లయిన మహిళల్లో 39 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

పోలాండ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ ప...