Hyderabad, మార్చి 18 -- పెళ్లి తర్వాత పొట్ట వస్తుంది, పెళ్లయ్యాక బరువు పెరుగుతారు అనే మాటలు మీరు చాలా సార్లు వినే ఉంటారు. విన్నప్పుడల్లా నవ్వుకుని ఉంటారు కదా. సిల్లీగా అనిపించే ఈ మాటల్లో వాస్తవం ఎంత ఉంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇందంతా నిజమే అంటే నమ్ముతారా? అవును కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ వివాహం తర్వాత చాలా మంది స్త్రీలు, పురుషుల బరువు పెరగడం వాస్తవమేనట. పెళ్లి, బరువుకీ మధ్య ఉన్న సంబంధం గురించి తాజా అధ్యయనాలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాయి.

వార్సా, పోలెండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ బృందం చేసిన కొత్త అధ్యయనం ప్రకారం, వివాహానికి, శరీర బరువుకు మధ్య స్పష్టమైన సంబంధం కనిపోస్తుంది. పెళ్లి చేసుకోవడం వల్ల చాలా మంది ప్రజలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడతారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది పురుషులు, మహ...