Hyderabad, ఏప్రిల్ 11 -- వేసవి రోజుల్లో వేడి కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. దీని వల్ల కొంతమంది శరీరాల నుండి వింత వాసన వస్తుంది. ఈ వాసన నుండి బయటపడటానికి ప్రజలు రోజూ పెర్ఫ్యూమ్ అప్లై చేసుకుంటారు. ఇలా దుర్వాసన నుంచి బయట పడేందుకు కొద్దిగా పెర్ఫ్యూమ్ చల్లడం ద్వారా మీరు మాత్రమే కాదు మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీలో తెలియని ఆత్మవిశ్వాసం, ఉత్సాహం వస్తాయి. నలుగురిలోకి వెళ్లినప్పుడు కంఫర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు.

ఇక్కడ సమస్య ఏంటంటే.. కొంతమంది పెర్ఫ్యూమ్ వాసన వారి శరీరంలో ఎక్కువసేపు ఉండదని, కాసేపటికే చమట వాసన తిరిగి బయటకు వస్తుందనీ చెబుతుంటారు. ఇలా మీకు కూడా జరుగుతుంది అంటే మీరు పెర్ఫ్యూమ్ అప్లై చేసే విధానంలో కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తున్నారని అర్థం. సువాసన ఎక్కువ కాలం పాటు ఉండాలంటే వేసవిలో పెర్ఫ్యూమ్ ఎలా వాడాలో ఇక్కడ తెలుసు...