Hyderabad, ఏప్రిల్ 17 -- పెరుగుతున్న బరువుతో ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి తప్పుడు ఆహారం, రెండవది శారీరక శ్రమ తగ్గిపోవడం. కారణాలైవైనా బరువు తగ్గడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వాకింగ్, జాగింగ్ వంటి వాటితో వ్యాయామాలు, యోగాసనాలు వంటివి చేస్తుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆహారంలో మార్పు. వెయిట్ లాస్ కోసం ఒక డైట్ ప్లాన్ చేసుకుని దాని అనుగుణంగా ఆహారాలను విభజించి తీసుకుంటున్నారు. మీరు కూడా అలాంటి వారే అయితే మీ డైట్‌లో పెరుగును తప్పకుండా తీసుకోండి.

కాల్షియం, ప్రోబయోటిక్స్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలతో నిండిన పెరుగు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీన్ని విధాలుగా మీ వెయిట్ లాస్ డైట్ లో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. పెరుగును ఎలా తింటే సులభంగా, త్వరగా బరువు తగ్...