Telangana, జూలై 26 -- చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ సమస్యలను చెక్ పెట్టే దిశగా..ఫేసియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకురానుంది. తద్వారా మరింత సులభంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేయాలని భావిస్తోంది. ఈ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసంది.

ప్రస్తుతం వేలిముద్రల ఆధారంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. అయితే వృద్ధుల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వారి వేలిముద్రలు అరిగిపోవటం వంటి సమస్యలతో డబ్బులు డ్రా చేయటం ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు. ఫేసియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. ఈ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటు...