భారతదేశం, ఏప్రిల్ 29 -- మోహ‌న్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో పెద‌రాయుడు ఒక‌టి. 1995లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. డ్యూయ‌ల్ రోల్‌లో మోహ‌న్‌బాబు అస‌మాన న‌ట‌న‌... అతిథి పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ మేజ‌రిజ‌మ్స్ డైలాగ్స్‌, అద్భుత‌మైన పాట‌లు...వెర‌సి బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన నాట్ట‌మై రీమేక్‌గా పెద‌రాయుడు తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం. త‌మిళంలో కంటే తెలుగులోనే ఈ మూవీ పెద్ద విజ‌యాన్ని సాధించింది. పెద‌రాయుడు సినిమా సీనియ‌ర్ ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ కాంబోలో రావాల్సింది. కానీ ర‌జ‌నీకాంత్ వ‌ల్ల ఈ తండ్రీకొడుకుల కాంబో మిస్స‌య్యింది.

సుంద‌ర‌కాండ‌, కొండ‌ప‌ల్లి రాజా వంటి సినిమాలు నిర్మించిన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కేవీవీ స‌త్య‌నారాయ‌ణ...నాట్ట‌మై సినిమాను తెలుగులో రీమేక్ చ...