Hyderabad, జూన్ 20 -- బిగ్ బాస్ తెలుగు సీజన్ 8తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ తెలుగు 7, 8 రెండు సీజన్లలో మంచి గేమ్ ఆడి ఆకట్టుకున్నాడు. అయితే, గౌతమ్ కృష్ణ హీరోగా చేసిన రెండో సినిమా సోలో బాయ్. పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్స్. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు.

జూన్19న సోలో బాయ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా సోలో బాయ్ ట్రైలర్‌ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో గౌతమ్ కృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. "మా మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్ర కథ మధ్య తరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం. నా మొదటి సినిమా అంతగా ఆ...