భారతదేశం, నవంబర్ 5 -- దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న తాజా మూవీ 'పెద్ది'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని 'చికిరి చికిరి' అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో రామ్ చరణ్ మాస్ హుక్ స్టెప్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ స్టెప్‌ను చూసిన వెంటనే అభిమానులు, ఇది మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ సినిమా 'ముఠా మేస్త్రి'లోని ఐకానిక్ స్టెప్‌ను పోలి ఉందని కామెంట్స్ చేశారు.

రామ్ చరణ్ లీడ్ రోల్లో నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ శుక్రవారం (నవంబర్ 7) రిలీజ్ కానుంది. అయితే అంతకుముందు బుధవారం ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. కేవలం 23 సెకన్లు ఉన్న ఈ 'చికిరి చికిరి' ప్రోమోలో రామ్ చరణ్ ఒక బీడీ తాగుతూ, ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్ ...