భారతదేశం, జూలై 21 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు. పెద్ది మూవీలోని రా అండ్ రస్టిక్ లుక్ కోసం కండలు పెంచేస్తున్నారు. స్టోరీకి తగ్గట్లుగా బాడీ షేప్ ను ఛేంజ్ చేస్తున్నారు. జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. కండలు తిరిగిన బాడీతో, చెమటలు కక్కుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు రామ్ చరణ్. ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.

పెద్ది సినిమా కోసం లుక్ ను మార్చేందుకు కష్టపడుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటో వైరల్ గా మారింది. సోమవారం (జులై 21) ఇన్ స్టాగ్రామ్ లో రామ్ చరణ్ పోస్టు చేసిన పిక్ అదిరిపోయింది. సైడ్ లుక్ లో కండలను చూపిస్తున్నాడీ మెగా హీరో. ''పెద్ది మూవీ కోసం మారే ప్రక్రియ మొదలైంది. స్వచ్ఛమైన ధైర్యం. నిజమైన ఆనందం'' అని క్యాప్షన్ ఇచ్చారు రామ్ చరణ్. ఈ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్ ల మీద లైక్ లు కొట్టేస్తున్న...