భారతదేశం, నవంబర్ 13 -- మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేశారు. కబ్జా వివరాలు బయటపెట్టారు. 76.74 ఎకరాల అటవీ భూమి కబ్జా అయ్యిందంటూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇందులో మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందంటూ ప్రకటన చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో 70 ఎకరాల వారసత్వ భూమి పెద్దిరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

"అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్హులవుతారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది" అని డిప్యూటీ సీ...