భారతదేశం, అక్టోబర్ 13 -- పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌ ఎయిర్ పోర్ట్ విషయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక విషయం తెలిపింది. ఇక్కడ ఎయిర్ పోర్ట్ నిర్మించడం వీలుకాదని వెల్లడించింది. దీంతో ప్రత్యామ్నాయంగా జిల్లాలోని అంతర్గాంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాల కోసం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ ఫీల్డ్ విమానాశ్రయం అధ్యయనం చేయడానికి రూ.40.53 లక్షలను విడుదల చేసింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు విమానాశ్రయం ఏర్పాటుపై రిపోర్ట్ తయారు చేసిన సమర్పించనున్నారు. అక్టోబర్ 11, 2025న జారీ చేసిన GO Rt. నం. 465 ప్రకారం, ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కన్సల్టెంట్‌గా నియమించారు. 18 శాతం జీఎస్టీతో సహా కన్సల్టెన్సీ ...