Hyderabad, ఏప్రిల్ 11 -- చేతులు, కాళ్ళు, ముఖం చూసి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. కానీ మీ పెదవులు కూడా మీ ఆరోగ్యం గురించి చెబుతాయని మీకు తెలుసా? పెదవులకు సంబంధించిన సమస్యలను అంటే పెదవులు పగలడం, నల్లగా మారడం వంటివి మీరు వాతావరణం, అందానికి అనుసంధానించే అవకాశం ఉంది.కానీ వాస్తవానికి అవి శరీరంలో ముఖ్యమైన పోషకాల లోపం వల్ల వస్తాయి. పగిలిపోయిన తరచూ పగలడం, నల్లగా అందవిహీనంగా కనిపించడం కేవలం వాతావరణం వల్ల కాదని తెలుసుకోండి. అలాగే ఇందుకు పరిష్కారంగా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన లిప్‌బామ్‌లు, రకరకాల క్రీములకు వాడకండి.

ఏ సమస్యకైనా సహజమైన, శాశ్వతమైన పరిష్కారం లభించాంటే దానికి కారణం తెలయాలి.పెదవుల విషయంలోనూ అంతే. కొందరికి పెదవులు తరచూ పగులుతుంటాయి, ఇంకొందరికి లిప్స్ కలర్ మారి చూడటానికి బాగొదు. మరికొందరి విషయంలో పెదవుల అంచుల్లో పగుళ్లు, పుండ్లు వస్...